Sunday, April 28, 2024

జిల్లాలో నాలుగురోజులుగా ముసురు వర్షం.. ఎక‌రాల్లో పంట న‌ష్టం..

కర్నూలు , (ప్రభ న్యూస్‌) : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 8,268 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆరు మండలాల్లో 28 గ్రామాలకు సంబంధించి పంటలు వర్షార్పణం అయ్యాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,479 ఎకరాలు, మినుము 450 ఎకరాలు, శనగలు 638 ఎకరాలు ఉన్నాయి. దొర్నిపాడు మండలంలో మూడు గ్రామాలలో వరి వంద ఎకరాలు, కోవెలకుంట్ల మండలంలోని రెండు గ్రామాలలో వరి 50 ఎకరాలు, చాగలమర్రి మండలంలోని ఐదు గ్రామాలలో వరి 600 ఎకరాలు, మినుములు 450 ఎకరాలు, శనగలు 1620 ఎకరాలు, 2,675 ఎకరాల్లో ఈ మండలంలో పంటలు దెబ్బతిన్నాయి.

హొళగుంద మండలంలోని నాలుగు గ్రామాల్లో వరి 123 ఎకరాలు, కొలిమిగుండ్ల మండలంలోని 9 గ్రామాల్లో శనగ 4,220 ఎకరాల్లో, కోసిగి మండలంలోని ఐదు గ్రామాల్లో వరి 600 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు దొర్నిపాడు, కోవెలకుంట్ల, చాగలమర్రి, హొళగుంద, కొలిమిగుండ్ల, కోసిగి మండలాల్లోని 28 గ్రామాల్లో 8,268 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు కలెక్టర్‌, వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు జేడీఏ వరలక్ష్మి మంగళవారం తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నివేదికను కలెక్టర్‌ ద్వారా వ్యవసాయ శాఖ కమిషనర్‌కు పంపనున్నారు.

పంటనష్టం ఇన్యుమరేషన్‌పై ఎప్పటికప్పుడు ఏడిఏ, ఏఓలు అప్రమత్తంగా ఉండి సమాచారాన్ని సకాలంలో జేడిఏ కార్యాలయానికి అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గత ఐదురోజులుగా వర్షాలు కురుస్తున్నాయని, పంటలు దెబ్బతినకుండా అన్నదాతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే బాధ్యత సంబంధిత ఏడీఏలదేనని ఆమె సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement