Monday, May 20, 2024

TDP Campaign – మీ బిడ్డ కాదు..కేన్సర్​ గడ్డ – జగన్​పై బాబు ఆగ్రహం

ఈ ఎన్నిక‌ల్లో ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయ‌న్నారు. దళిత, గిరిజన ద్రోహి జగన్ అని, ఆయన ఓటేసిన వారిని కాటేసే రకం అంటూ మండిప‌డ్డారు. వైసీపీ వల్ల ఉద్యోగాలు వచ్చాయా? డీఎస్సీ పెట్టాడా? ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాడా? కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలతో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది. రాష్ట్రంలో ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఉంది.. సూపర్ సిక్స్ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఇవన్నీ అమలు చేస్తాం అన్నారు చంద్ర‌బాబు.

ఆల‌యాల‌పై దాడులు చేశారు..

వైసీపీ పాలనలో 160కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. అర్చకులపై దాడులు జరిగాయి. దేవాలయ ఆస్తులను కబ్జాలు చేశారు. భూములు కొట్టేశారు. దేవాలయ పవిత్రతను మంటగలిపి ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. కూటమి అధికారంలోకి వస్తూనే దేవాలయాలు కూల్చివేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఇక్కడ బీసీలు కూడా ఉన్నారు. వైసీపీ పాలనలో మీకేమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడు హామీ ఇస్తున్నాం. 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తాం. ₹1.50 లక్షల కోట్లు ఖర్చుపెడతాం. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. ఇది కాకుండా పేదలందరికీ నెలకు ₹4వేలు పెన్షన్ ఇస్తాం. పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తాం. ప్రతి నెల మొదటి తారీఖునే ఇంటివద్దనే ఇస్తామ‌ని చంద్ర‌బాబు అన్నారు.

- Advertisement -

అంతా గులకరాయి డ్రామా..

మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది. జగన్ మేనిఫెస్టో వెలవెలబోతోంద‌ని చంద్రబాబు అన్నారు. ఇవాళ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావ‌న్నారు. బాబాయ్ ని గొడ్డలితో లేపేసిన పార్టీ మనకు కావాలా?.. కోడికత్తి డ్రామా మనకు కావాలా?.. గులకరాయి డ్రామా మనకు కావాలా? ఏంటీ అరాచకాలు? రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది, ఆదాయం పడిపోయింది. మళ్లీ వైసీపీకి పొరబాటున ఓటేస్తే మీ ఆస్తులు మీవి కావు. ఇవాళ కొత్త చట్టాన్ని తీసుకువచ్చాడు. మీ ఆస్తులపై కన్నేశాడు. ఐదేళ్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లేటరైట్ ముసుగులో బ్లాక్సెట్ను దోచుకున్నారు. జగన్ మీ బిడ్డ కాదు.. రాష్ట్రానికి పట్టిన కేన్సర్ గడ్డ” అని చంద్రబాబు విమర్శించారు. ఈ ఎన్నిక‌ల‌లో కూట‌మి అభ్య‌ర్ధుల‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement