Sunday, December 8, 2024

నిషేధిత పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం

రాష్ట్రంలో నిషేధిత పొగాకు ఉత్ప‌త్తుల‌పై ఉక్కుపాదం మోపుతామ‌ని ప్ర‌త్తిపాడు ఎస్ఐ సీహెచ్ ప్ర‌తాప్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో నిషేధించబడిన గుట్కా, ఖైని లాంటి పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు జరుపుతున్న వారిపై దాడులు జరిపి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. అందులో భాగంగా అందిన‌ సమాచారం మేరకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పార్వతీపురం గ్రామంలో తనిఖీలు చేయగా అడ్డగిరి విజయ్ కృష్ణ తండ్రి సాంబశివరావు దగ్గర రూ.2వేల విలువచేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీన పరచుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జ‌రిగింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement