Saturday, April 27, 2024

AP : రైతు గోడు వినండి… వంశధార జలసాధన కమిటీ అధ్యక్షుడు శివాజీ…

సోంపేట, మార్చి 16(ప్రభ న్యూస్ ) సీఎం జ‌గ‌న్ ఉద్దాన ప్రాంతంలోని రైతుల గోడును వినాల‌ని ను వంశధార జలసాధన కమిటీ అధ్యక్షుడు శివాజీ అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన లో రైతు సమస్యపై ఓ వినత పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కాలంగా రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ సాగునీరు అందక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.

- Advertisement -

ఇచ్చాపురం నియోజవర్గం అట్టడుగున ఉందని సరైన జీవనాధారం లేక, పరిశ్రమలు లేక, ఉపాధి కల్పన రంగాలు లేక 80 శాతం మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని సుమారు 40,000 మంది యువకులు వలసలు పోయి దేశంలోనే అత్యధిక వలసలు కలిగిన ప్రాంతంగా ఉద్దాన ప్రాంతం ఉందని, 12 సెంటీమీటర్ల వర్షపాతం తో పాటుగా శ్రమించి పనిచేసే కర్షకులు సారవంతమైన భూమి ఉన్నప్పటికీ వర్షాధారం తప్ప సాగు చేయడానికి సాగునీరు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని, స్వాతంత్రం అనంతరం ఒక్క అదనపు ఎకరం స్థిరీకరించలేదనిగుర్తు చేశారు.

ఉపరితల జలాలు నిల్వ చేయలేకపోవడం సాగుదారులకు నికర సాగునీటి సదుపాయం లేకపోవడం ఇచ్చాపురం కవిటీ కంచిలి సోంపేట మండలాల్లో బహుదానది మహేంద్ర తనయ నది చెరువుల ఆధారంగా వర్షాధారం కలమెట్టు భూములు 70000 ఎకరాల వ్యవసాయ సాగు భూమి ఉందని కానీ వ్యవసాయ వినియోగంనకు నికర జలాలు లేక వ్యవసాయను వర్షాధారంగానే వ్యవసాయం కొనసాగిస్తున్నారని తెలియజేశారు. జిల్లాలో ప్రవహిస్తున్న వంశధార నది జలాలు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పంపిణీ జరుగుతుంది గానీ ఇచ్చాపురం నియోజకవర్గం కు మాత్రం వంశధార నది సాగునీటి జలాలు వినియోగించబడడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చలవతో శుద్ధమైన ఉపరితల జలాలు వంశధార నుండి ఇచ్చాపురం వరకు ఇచ్చి ఆదుకున్నారని ఎందుకు తాము కృతజ్ఞతులమణి తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement