Saturday, May 4, 2024

భార్య, కుమార్తెను నరికిన క్రూరుడు… కూతురు మృతి, కొన ఊపిరితో భార్య

ఆమదాలవలస : మునిసిపాలిటీ పరిధిలో ఉన్న సొట్టవానిపేట గ్రామానికి చెందిన కొలిసి రామారావు అనే వ్యక్తి శుక్రవారం తన భార్య సూర్యంను, కుమార్తె విజయను కత్తితో దారుణంగా నరికాడు. తన ఇంటిలోనే జరిగిన ఈ సంఘటనలో కుమార్తె అక్కడిక‌క్క‌డే చనిపోగా, కొన ఊపిరితో ఉన్న భార్య సూర్యంను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్ కు చికిత్సకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement