Wednesday, May 8, 2024

Special: సంక్రాంతికి ప్ర‌త్యేక రైళ్లు… ఆ రూట్ల‌లో

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగ దృష్ట్యా రైల్వే శాఖ ప్ర‌త్యేక రైళ్లను న‌డప‌నుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ తెలిపారు. హైదరాబాద్‌-తిరుపతి(07489/07490) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకోనుంది.

తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి ఉదయం 8.50కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌-తిరుపతి (07449/07450) మరో స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 27వ తేదీ సా. 6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌-కాకినాడ (07451/07452) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉ. 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉ.9కి హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement