Thursday, May 9, 2024

Followup | ఏసీబీకి చిక్కిన సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి.. ఏకకాలంలో దాడులు

ఏలూరు, ప్రభ న్యూస్‌ బ్యూరో: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న సమాచారంతో ఏసీబీ అధికారులు తాడేపల్లిలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఇన్స్టిట్యూషన్‌ సొసైటీ జాయింట్‌ సెక్రెటరీగా విధులు నిర్వర్తిస్తున్న కేడివిఎం ప్రసాద్‌ బాబు (గ్రూప్‌ వన్‌ అధికారి) ఆస్తులపై దాడులు నిర్వహించి కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులను గుర్తించారు కైకలూరు సమీపంలోని గుమ్మళ్ళపాడులో ఆయన నివాస గృహంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి.

అక్రమాస్తులను గుర్తించారు.ఏసీబీ కాల్‌ సెంటర్‌ కు వచ్చిన సమాచారం మేరకు ఏసీబీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాలతో ఎసిబి అడిషనల్‌ ఎస్పీతో కూడిన బృందం పలుచోట్ల దాడులు నిర్వహించారు . 1991 హైదరాబాద్లో ఐటిబిపి కానిస్టేబుల్‌ గా ఉద్యోగ బాధ్యతల లో ప్రవేశించిన ప్రసాద్‌ బాబు పోలీస్‌ శాఖలో సిఐ వరకు పదోన్నతి పొందారు.

- Advertisement -


2007లో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌ వన్‌ అధికారిగా టెజరీ అండ్‌ అకౌంట్‌ డిపార్ట్మెంట్లో ఏటిఓగా చేరి భువనగిరిలో జిల్లా ఏటీవో గా టెజరీ కార్యాలయంలో ఏడిగా కృష్ణాలో డిఆర్డిఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేశారు .కాగా బుధవారం నిర్వహించిన దాడుల్లో కోట్లాది రూపాయల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు ఏలూరులో రెండు ఫ్లాట్లు విజయవాడలోని పోరంకిలో రెండు ఫ్లాట్లు ఏలూరులోని మాదే పల్లిలో ఒక భవనం హైదరాబాదులోని భూదాన్‌ పోచంపల్లి వద్ద జి ప్లస్‌ టు భవనం పామర్రులో ప్లాటు దెందులూరు మండలంలో 90 సెంట్లు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నట్లు ఏసీబి అధికార్లు గుర్తించారు.


వీటికి తోడు స్కోడా రాపిడ్‌ ఫోర్‌ వీలర్‌ మారుతి ఎర్టిగా ఫోర్‌ వీలర్‌ ఇన్నోవా సదన్‌ ఫోర్‌ వీలర్‌ బుల్లెట్‌ క్లాసిక్‌ టూవీలర్‌ యాక్టివా ఎలక్ట్రిక్ర్‌ టూవీలర్‌ యాక్టివా మోటార్‌ సైకిల్‌ ఇతర గృహోపకరణాలు 500 గ్రాముల బంగారు ఆభరణాలు 30 వేల నగదును గుర్తించారు అలాగే 15 లక్షల విలువైన ఎల్‌ఐసి పాలసీలు కోటి రూపాయలు విలువైన మౌనిక ఆక్వా ఫామ్‌ లో పెట్టుబడి, ఇతర వ్యక్తులకు ఇచ్చిన ప్రాంసరీ నోట్లు తాలూకు 26 లక్షల నగదు మౌనిక ఆక్వా ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో ఖర్చు చేసిన 30 లక్షలు ఆస్తులను గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement