Sunday, April 28, 2024

కపిలతీర్థంలో సజావుగా దర్శనాలు – అశోక్ కుమార్

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : తిరుపతి కపిలతీర్థంలో దర్శనాలు సజావుగా సాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని టిటిడి పాలకమండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తెలియజేసారు. తిరుపతి కపిలతీర్థంలో ఇటీవల వర్షాలకు మండపంలోని మూడు స్థంబాలు దెబ్బతిన్న సంఘటనలో ప్రజలు కొంత అపోహలు పడ్డారని, భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా తమ పాలకమండలి చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి ఎప్పటికప్పుడు తమకు, అధికారులకు సూచనలు ఇచ్చి కపిలతీర్థంలో దైవదర్శనాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

పాక్షికంగా దెబ్బతిన్న స్థంబాలను మార్చి మండపాన్ని పటిష్టం చేసే పనులు జరుగుతున్నాయన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులతో ఆయన మాట్లాడి సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాటులు లేవని తెలుసుకొని అధికారులను అభినందించారు. అనంతరం అక్కడికి వచ్చిన తిరుపతి జేఇఓ వీరబ్రహ్మంతో మాట్లాడుతూ… సమస్యల పరిష్కారానికి సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యం, సుపర్డెంట్ భూపతి, టెంపుల్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రీనివాసనాయక్, ఆలయ సిబ్బంది హరిప్రసాద్, రమేష్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement