Saturday, October 12, 2024

AP | చంద్రునిపై విక్రమ్​ ల్యాండింగ్ పిల్లలకు చూపించండి.. అధికారిక ఉత్తర్వులు జారీ

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో): భారతదేశ అంతరిక్ష పరిశోధనల గొప్పతనాన్ని, శాస్త్రవేత్తల ప్రతిభను విశ్వానికి చాటిచెప్పే విధంగా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 రేపు సాయంత్రం చంద్రునిపై అడుగుపెట్టనున్నది. ఆ గొప్ప క్షణాలను వీక్షించడానికి అంతరిక్ష ప్రేమికులందరూ సిద్ధం అవుతున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులందరూ వీక్షించేలా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులందరూ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షా విభాగం డైరెక్టర్ మస్తానయ్య ఉత్తర్వులు జారీ చేసారు. అందులో అన్ని విద్యాసంస్థలలో రేపు సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ఆ వివరాల ప్రకారం చంద్రునిపై వాహక నౌక ల్యాండర్ విక్రమ్ దిగే దృశ్యాలను ఈ క్రింది వాటి ద్వారా లైవ్​లో వీక్షించ వచ్చు.

ఇస్రో వెబ్ సైట్
http://www.isro.gov.in/

ఇస్రో ఫేస్బుక్ లైవ్
https://www.facebook.com/ISRO

ఇస్రో యు ట్యూబ్ ఛానెల్
(‘ISRO official )

- Advertisement -

DD (Doora Darshan ) national TV channel

Advertisement

తాజా వార్తలు

Advertisement