Wednesday, May 1, 2024

AP : పోలియో రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలి.. స్పీక‌ర్ తి తమ్మినేని..

ఆముదాలవలస,మార్చి 3(ప్ర‌భ‌న్యూస్‌): ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఆరోగ్యవంతమైన బంగారు జీవితానికి బాటలు వేయాలని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాo అన్నారు. ఆదివారం ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని మొనింగీ వారి వీధి లో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్​లలో ప్రజలు తప్పకుండా తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. హైరిస్క్ ప్రాంతాల్లో ఉన్న చిన్నారుల్లో ఏ ఒక్కరూ మిగిలిపోకుండా పోలియో చుక్కలు వేయాలని అన్నారు. ఇంటింటికి తిరిగి మిగిలిపోయిన చిన్నారులకు కూడా చుక్కల మందు వేయాలని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా పల్స్ పోలియో వ్యాక్సిన్ వలన కలిగే ప్రయోజనాలను పిల్లల మాతృమూర్తులకు వివరించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులపై, సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement