Thursday, May 2, 2024

కరోనా భయం భయం..పాఠశాలను మూసివేసిన యాజమాన్యం

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనాతో ఇప్పుడు ఓ స్కూలునే మూసివేసింది యాజమాన్యం. కర్నూలు జిల్లా పత్తికొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం వీరిద్దరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో, నిన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ టెస్టుల్లో వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, పాఠశాలను మూసివేశారు. ఈరోజు నుంచి స్కూలును మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడటంతో… ఆ స్కూల్లో చదువుతున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement