Saturday, May 4, 2024

నిరాశలో సూర్య ఫ్యాన్స్..!!

సుధా కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన చిత్రం ఆకాశం నీ హద్దురా.. ఓటిటి వేదికగా రిలీజైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ కథను సుధా కొంగర అద్భుతంగా తీశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఆస్కార్ అవార్డు పోటీలో నిలిచిన సంగతి కూడా తెలిసిందే.

మొత్తం 366 చిత్రాలను ఆస్కార్ అవార్డ్ నిర్వాహకులు ఎంపిక చేయగా ఇండియా నుంచి ఆకాశం నీ హద్దురా (సూరారై పొట్రు) మాత్రమే బరిలో నిలిచింది. అయితే అకాడమీ స్క్రీనింగ్ కు ఎంపికైన ఈ చిత్రం ఆ తర్వాతి రౌండ్స్ కు నామినేట్ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మార్చి 15న ఆస్కార్ నుంచి తప్పు కుంది. ఇక ఈ వార్త సూర్య అభిమానులకు నిరాశకు గురిచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement