Tuesday, April 30, 2024

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు

అమరావతి, ఆంధ్రప్రభ: ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండీయర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇంటర్మీడట్‌ బోర్డు సోమవారం విడుదల చేసింది. మార్చి 2023… 15న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు సాగుతాయి. మార్చి 15న మొదటి సంవత్సరం విద్యార్ధుుల కు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌తో పరీ క్షలు ప్రారంభమౌతాయి. మరుసటి రోజున రెండో సంవత్సరం విద్యార్ధులకు సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌తో పరీక్షలు ప్రారంభమవుతాయి. మొదటి సంవత్సరం విద్యార్ధులకు 17న ఇంగ్లీష్‌ పేపర్‌, 20వ తేదీన మాధ్యమేటిక్స్‌ పేపర్‌ 1ఎ, బోటనీ, సివిక్స్‌ పేపర్లకు, 23వ తేదీన మేధమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ, హిస్టరీ పేపర్లకు, 25వ తేదీన ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్లకు, 28వ తేదీన కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ఆర్ట్స్‌ మ్యూజిక్‌ పేపర్లకు, 31వ తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌ పేపర్‌, బ్రిడ్జి కోర్సు మేధమేటిక్స్‌ పేపర్లకు, ఏప్రిల్‌ మూడో తేదీన మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరుగుతాయి.

రెండో సంవత్సరం విద్యార్ధులకు 16వ తేదీన సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌కు, 18వ తేదీన ఇం గ్లీష్‌ పేపర్‌కు, 21వ తేదీన మ్యాధమేటిక్స్‌ 2ఎ, బోటనీ, సివిక్స్‌ పేపర్లకు, 24వ తేదీన మ్యాధమేటిక్స్‌ 2బి, జువాలజీ, హిస్టరీ పేపర్లకు, 27వ తేదీన ఫిజిక్స్‌, ఎకానామిక్స్‌ పేపర్‌, 29వ తేదీన కెమిస్ట్రీ, కామర్స్‌, సోషియాలజీ, ఫైన్‌ఆర్ట్స్‌ మ్యూజిక్‌ పేపర్లకు, ఏప్రిల్‌ ఒకటో తేదీన పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లాజిక్‌ పేపర్‌, బ్రిడ్జి కోర్సు మేధమేటిక్స్‌ పేపర్లకు, ఏప్రిల్‌ నాలుగో తేదీన మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరుగుతాయి. ఈమేరుకు ఇంటర్‌ బోర్డు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయి. ఎథిక్స్‌ అండ్‌ హ్యుమాన్‌ వాల్యూస్‌ పరీక్ష ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఒంటి గంటకు, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ను 2023 ఏప్రిల్‌ 15వ తేదీన, ఏప్రిల్‌ 25వ తేదీన, ఏప్రిల్‌ 30వ తేదీన, మే 10వ తేదీన నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement