Monday, April 15, 2024

అమేజింగ్ స్టోరీ లైన్ రెడీ చేసిన యంగ్​ డైరెక్టర్​.. ఈసారి 3Dలో రానున్న కార్తికేయ నెక్స్ట్ పార్ట్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ సిద్దార్థ నటించిన కార్తికేయ సిరీస్​ మూవీస్​ బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌ గా నిలిచాయి. యంగ్​ డైరెక్టర్ చందూ మొండేటి ఆ మూవీకి సీక్వెల్‌గా కార్తికేయ 2 ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండో పార్ట్ కూడా సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుని.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక మరోసారి కార్తికేయ 3తో ఆడియెన్స్ ను పలుకరించనున్నట్టు ఇప్పటికే నిఖిల్ టీం ప్రకటించింది.

ఇక.. తాజాగా కార్తికేయ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు నిఖిల్ సిద్దార్థ. ఇవ్వాల రాత్రి 7:30 గంటలకు సోషల్ మీడియాలో #AskNikhil అనే సెషన్‌లో పాల్గొన్నాడు నిఖిల్. చిట్ చాట్‌ సెషన్‌లో ఓ అభిమాని.. “అన్న కార్తికేయ 3 ఉంటుందా..?” అని అడిగాడు. దీనికి నిఖిల్‌ స్పందిస్తూ.. కచ్చితంగా ఉంటుంది.. మూవీ డైరెక్టర్​ అద్బుతమైన స్టోరీ లైన్ వినిపించారు. అంతే కాదు కార్తికేయ 3 ఈ సారి 3డీలో రానుంది’’ అంటూ క్రేజీ అప్‌డేట్ అందించాడు నిఖిల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement