Friday, May 17, 2024

స్కూల్‌ అసిస్టెంట్లు, గ్రేడ్‌ 2 హెడ్‌ మాస్టర్ల పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో, జిల్లా పరిషత్‌, మండల్‌ పరిషత్‌ స్కూళ్లలో స్కూల్‌ అసిస్టెంటు, గ్రేడ్‌ 2 హెడ్‌ మాస్టర్లుగా పదోన్నతులు ఇచ్చేందుకు ప్రాధమిక విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల రెండో తేదీ నుండి సినీయారిటీ జాబితాను తయారు చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను ఏడో తేదీ నుండి వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఈనెల ఏడు, ఎనిమిది తేదీల్లో సీనియారిటీ జాబితాపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరిస్తారు. తొమ్మిదో తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పదో తేదీన తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. పదమూడో తేదీ నాటికి పదోన్నతల ప్రక్రియనంతా ముగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement