Thursday, May 2, 2024

Sandle wood smugglers – టాస్క్ ఫోర్స్ దాడిలో 31మంది స్మగ్లర్లు అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో ) : ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి తెలిపారు. ఈరోజు సాయంత్రం టాస్క్ ఫోర్స్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో సంబంధిత వివరాలను ఆయన వెల్లడించారు.

ముందుగా వచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐలు వినోద్ కుమార్, విశ్వనాథ్ టీమ్ నిన్న ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలు –చీమకుర్తి రోడ్డు వద్ద సంతనూతలపాడు పోలీసు స్టేషను సమీపంలో తనిఖీలు చేపట్టారు.ఆ సందర్బంగా ఒక టాటా కంపెనీ లారీ, బొలేరో వాహనంలో ఎర్రచందనం దుంగల రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. సిబ్బంది తో చుట్టూముట్టి 30 మంది ఎర్రచందనం దొంగలను అదుపులో తీసుకున్నారు. వారి నుంచి 15ఎర్రచందనం దుంగలు, 20గొడ్డళ్లు, 20 సెల్ ఫోన్లు పాటు రూ.24వేలు స్వాధీనం చేసుకున్నారు

.పట్టుబడిన వారిలో ప్రధాన ముద్దాయి గుద్దేటి రామనాథ రెడ్డి, (37)కాగా ఇతను నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన వ్యక్తి. ఇతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో 60కేసులు ఉన్నాయని, 4ఎన్బీడబ్ల్యూకల మోస్ట్ వాంటెడ్ ముద్దాయిగా ఎస్ పి చక్రవర్తి తెలిపారు.. ఇతనితోపాటు తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన మేస్త్రి రాజికుప్పుస్వామి(46)లుగా గుర్తించారు. మిగిలిన వారు తమిళనాడు నుంచి రాజికుప్పుస్వామికి చెందిన కూలీలుగా గుర్తించినట్లు చెప్పారు పట్టుబడిన దుంగల విలువ రూ.25లక్షల వరకు ఉండగా, వాహనాలు రూ.20లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. . వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేయగా, సీఐ జీ. శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు.

. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ ఆర్ఐఎస్ లు, ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులను సిఫారసు చేసినట్లు ఎస్ పి చక్రవర్తి చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement