Thursday, April 25, 2024

Breaking: మంగళగిరి వైసిపిలో అసమ్మతి సెగ… ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా

మంగళగిరి డిసెంబర్ 11 ప్రభ న్యూస్- ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సోమవారం ఉదయం ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆర్కే తెలిపారు. స్పీకర్ ఓఎస్డీకి రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు చెప్పారు. తన రాజీనామాకు గల కారణాలను త్వరలో పూర్తిగా తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు

కగా, వైసీపీ ఇన్ ఛార్జిగా గంజి చిరంజీవిని నియమిస్తుండడంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిన్న (ఆదివారం) గంజి చిరంజీవి ప్రత్యేకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. .ఎమ్మెల్యే ఆర్కే అధిష్టానంపై తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే ఆర్కే కు వ్యతిరేక వర్గీయులుగా ఉన్న నాయకులంతా సమావేశమైన మరుసటి రోజు రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనియాంశంగా మారింది.

2014,2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై గెలుపొందిన నేపథ్యంలో ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని అందరూ ఊహించారు.మంత్రి పదవి రాకపోవడం ఎమ్మెల్యే ఆర్కే ని కొంత మనస్థాపానికి గురి చేసింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆర్కే కు అసెంబ్లీ సీట్లు లేదని సమాచారం. ఇదే ఆయన రాజీనామాకు ప్రధాన కారణమని స్థానికంగా చర్చ జరుగుతుంది ఏది ఏమైనా ఎమ్మెల్యే ఆర్కే ప్రకటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement