Monday, April 29, 2024

Criminal Leader | వైసీపీ నేత‌పై రేప్ కేసు.. మ‌హిళ‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డ ఎంపీటీసీల సంఘం నేత‌

బనగానపల్లె (నంద్యాల జిల్లా): నంద్యాల జిల్లా వైసీపీ ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గోపవరం గోపాల్ రెడ్డిపై లైంగిక దాడికి య‌త్నించాడ‌నే (రేప్‌) కేసు న‌మోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టు ఇవ్వాల (ఆదివారం) రాత్రి పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా అవుకు మండలం నిచ్చెనమెట్ల గ్రామానికి చెందిన 35 ఏండ్ల మహిళపై గోపాల్‌రెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింద‌ని పోలీసులు చెప్పారు.

ఈ క్ర‌మంలో ఐపిసి 354, 448, 506 సెక్షన్ల కింది నిందుతుడు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్య‌క్షుడు అయిన గోపాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ విష‌యం మీడియాకు తెలియ‌కుండా గోప్యంగా ఉంచ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement