Sunday, April 28, 2024

కృష్ణా జిల్లా నూత‌న క‌లెక్ట‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజాబాబు

కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ గా పి.రాజాబాబు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. శనివారం మచిలీపట్నం నగరం కలెక్టరేట్ లోని వారి చాంబర్ లో జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. వారికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి సాధర పూర్వకంగా ఆహ్వానం పలికారు. పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement