Friday, December 6, 2024

Breaking : మాజీ ఎంపీ..బిజెపి నాయ‌కులు క‌ణితి విశ్వ‌నాథం క‌న్నుమూత‌

విశాఖ‌ప‌ట్నం – ఉత్త‌రాంధ్ర సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు డాక్ట‌ర్ కణితి విశ్వనాధం శనివారం మధ్యాహ్నం మరణించారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయ‌న చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు.. కాగా విశ్వ‌నాథం 1932 జూలై 1న శ్రీకాకుళం జిల్లా లోని హరిదాసుపురంలో జన్మించారు. అతని తండ్రి దొంగాన చౌదరి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ చదివాడు విశ్వ‌నాథం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. కాగా ఆయ‌న శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1989, 1991 లలో రెండు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014 నవంబరు 7న బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి సమక్షంలో బిజెపిలో చేరారు. కాశీబుగ్గలో జరిగిన కార్యక్రమంలో అతని తనయుడు రాజేంద్ర, అతని అనుచరులు అధిక సంఖ్యలో బీజేపీలో చేరారు.1989లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.1989లో కౌన్సిల్ కమిటీ సభ్యుడు, ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వశాఖలో ప‌నిచేశారు.1990లో 10వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యునిగా 34 సంవత్సరాలు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement