Sunday, May 5, 2024

Rains Alert – బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం – రేప‌టి నంచి తెలుగు రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు ..

విశాఖ‌ప‌ట్నం – బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప‌డింది. దీంతో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రేప‌టికి అల్పపీడనంగా మారుతుందని, 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయని ఐఎండీ వివరించింది. ఇది క్రమేపీ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి పయనిస్తుందని పేర్కొంది.

తాజా బులెటిన్ ప్రకారం. . ఈ నెల 25 నుంచి 28 వరకు కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నెల 25 నుంచి 26 వరకు రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, వాతావరణ శాఖ తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement