Thursday, May 9, 2024

AP | అంచనాలకు అనుగుణంగా రైల్వే ఆదాయం…

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : అత్యంత సురక్షితంగా, నిర్దిష్ట సమయంలో సరుకు రవాణా చేయడంలో రైల్వే ఎంతగానో ఉపయోగపడుతుందని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ కె.రవికుమార్ రెడ్డి తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్లో ఉన్న పోర్ట్ అధికారులతో వ్యాపార అభివృద్ధిపై ఆయన విజయవాడలో ఇవ్వాల (శనివారం) ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ డివిజన్ లో డింగ్ ట్రెండ్లు లక్ష్యాలు సరుకుల వారీగా లోడింగ్ పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఏడాది మిగిలి ఉన్న ఆర్థిక సంవత్సరంతో పాటు, రాబోయే ఆర్థిక సంవత్సరంలో సరుకుల వారీగా లోడింగ్ అంచనాలను డివిజన్ మీదుగా సరుకు రవాణా చేసే అన్ని వాడరేవుల అధికారులు అంచనాల రూపొందించుకోవాలన్నారు. బ్రాంచ్ అధికారులు డివిజన్ పై రోడ్డు డిస్పాచ్ దూరాన్ని విశ్లేషించి, గరిష్ట సామర్థ్యాన్ని పంపించేందుకు, రైలు రవాణా ద్వారా అందించే ప్రయోజనాలు, రాయితీలను వివరించడం ద్వారా సరుకు రవాణా వినియోగదారులతో చర్చలు జరపాలని సూచించారు.

- Advertisement -

బిక్కవోలు, మచిలీపట్నం, రాయపట్నం, కాకినాడ గేట్ వే పోర్టులలో రాబోయే గతి శక్తి టెర్మినల్, వాటి ట్రాఫిక్ అంచనాల పై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కేవలం భాగస్వామ్య మార్గాలే కాకుండా సహకార సమన్వయ వ్యూహాన్ని అనుసరించి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ట్రాఫిక్ ను సరిదిద్దడం అనే ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి జోన్ డివిజన్లోని వాడరేవుల అధికారులకు పూర్తిస్థాయి సహకారం మార్గదర్శకత్వం తాను ఎప్పుడు మద్దతు, సహకారం ఇస్తానని హామీ ఇచ్చారు.

విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ మాట్లాడుతూ.. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ ఆదాయం అంచనాలకు అనుగుణంగా ఆశాజనకంగా ఉందన్నారు. ఇదే ఊపుతో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయాన్ని మెరుగుపరుచుకునే విధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గూడ్స్ రాకల టర్న రౌండ్ సమయాన్ని తగ్గించాలని వాటికి మెరుగైన సేవలు అందించడంలో సహాయపడేందుకు ట్రాఫిక్ పరిణామాన్ని మెరుగుపరచాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ వ్యాపార అభివృద్ధి సమావేశంలో మచిలీపట్నం పోర్టు, అదాని కృష్ణపట్నం, కాకినాడ సి పోర్టు, రామయ్యపట్నం పోర్ట్, కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement