Sunday, May 19, 2024

చంద్ర‌బాబు ఆరెస్ట్ ను ఖండించిన ఎపి బిజెపి చీఫ్ పురందీశ్వ‌రి…

అమ‌రావ‌తి – టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని… సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement