Monday, April 29, 2024

Railways | ప్రయాణికుల భద్రతకు పెద్దపేట.. ఫైర్ సేఫ్టీ పై ప్రజలకు అవగాహన

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : దక్షిణ మధ్య రైల్వే లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. విజయవాడ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేలో ఫైర్ సేఫ్టీ పై నిరంతరం ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ, ప్రయాణికులలో అవగాహన పెంపొందించేందుకు దీపావళి సందర్భంగా డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లో స్పెషల్ ఫైర్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.

ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి అన్ని ప్రధాన స్టేషన్ల లో ఆర్పీఎఫ్ బృందాలు, టికెట్ చెకింగ్ స్క్వాడ్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు, ఇన్స్పెక్టర్లు ప్రత్యేకంగా నియమించామన్నారు. ప్రయాణికులు మండే, పేలుడు పదార్థాల రవాణాన్ని పరివేక్షించేందుకు డివిజనల్ వారీగా అధికారులు నియమించి నిరంతరం పర్యవేక్షించామన్నారు.

- Advertisement -

దీపావళి పండుగ సీజన్ లో లగేజీ నిర్వహణ, ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఇతర ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక డాగ్ స్క్వాడ్లను నియమించి, అన్ని ప్రధాన విభాగాల్లో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. పార్సిల్ కార్యాలయాల వద్ద పార్సిల్ సామాన్లు నిర్వహణకు సంబంధించి ఎస్ఎల్ఆర్ లు పార్సిల్ వ్యాన్లు లో ఏమైనా పేలుడు, మండే పదార్థాలు లోడ్ చేస్తున్నారా ,లేదా అనేది క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు.

దీపావళి పండుగ సీజన్లో 26 పేంటీ కార్ లతనిఖీలు, 193 ఎస్ఎల్ఆర్ తనిఖీలు జరిగాయన్న ఆయన అన్ని అగ్ని మాపక భద్రత అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షించినట్లు చెప్పారు. ప్రయాణికులు ఎటువంటి మండే, పేలే పదార్థాలయ్యిన గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ స్టవ్వులు, అగ్గిపెట్టెలు, సిగరెట్లు, లైటర్లు, బాణాసంచాతో పాటు పేలుడు పదార్థాలను తీసుకువెళ్ల వద్దని సూచించారు.

రైల్వే ప్రయాణంలో మం,డే పేలుడు పదార్థాలు తీసుకెళ్లడం శిక్షార్కమైన నేరమని, ఇందుకు సంబంధించి రైల్వే చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి అన్నారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పిన ఆయన, ఏదైనా నష్టం, గాయం జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏడిఆర్ఎం ఆపరేషన్స్ ఎం శ్రీకాంత్, సీనియర్ డిసిఎం వావిలాపల్లి రాంబాబు తో పాటు పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement