Thursday, May 9, 2024

పీఎస్ఎల్వీ సీ-52 ప్ర‌యోగం స‌క్సెస్‌.. శాస్త్రవేత్త‌ల‌ను అభినంద‌న‌లు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నెల్లూరు జిల్లాలోని శ్రీ‌హరికోట నుంచి పీఎస్ ఎల్‌వీ సీ52 రాకెట్ ప్ర‌యోగం సక్సెస్ అయ్యింది. దీనిపై ఏపీ సీఎం జగన్ తో పాటు ప‌లువురు సైంటిస్టుల‌ను అభినందిస్తున్నారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో చేపట్టిన‌ తాజా ప్రయోగం సఫలం కావడంపై అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అగ్రదేశాలకు దీటుగా భారత్ ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడింపజేసిందని సీఎం జగన్ కొనియాడారు. ఇస్రో ఇకమీదట కూడా ప్రతి ప్రయోగంలోనూ విజయవంతం కావాలని అభిలషించారు. ఇస్రో ఇవాళ పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ ద్వారా ఈఓఎస్-04, ఇన్ స్పైర్ శాట్-1, ఐఎన్ఎస్ 2టీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. కాగా, ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి రాకెట్ ప్రయోగం.

Advertisement

తాజా వార్తలు

Advertisement