Tuesday, May 14, 2024

సేవలకు నిలువెత్తు రూపం హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్..

పామూరు రూరల్, (ప్రభ న్యూస్): ఆప్త మిత్రులు, బంధువులే పట్టించుకోని ఈ రోజుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ 5 సంవత్సరాల నుంచి పేదలందరికీ భోజనం, వైద్యాన్ని అందిస్తోంది.హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ పట్టణంలో స్థాపించబడి అయిదేళ్ళవుతోంది. అయితే ఈ సంస్థ సేవలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది మాత్రం 2020వ కరోనా పీరియడ్ నుంచే. ఆ సమయంలో కరోనా బారిన పడిన నిరుపేదలకు ఫుడ్ నుంచి బెడ్ వరకు అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటూ వస్తూ… ఈరోజు వరకు జిల్లా నుంచి మండలం వరకు ఆకలితో ఉన్న వారిని వెతుక్కుంటూ వెళ్లి మరీ సేవలను అందిస్తోంది.

అంతే కాకుండా అనాధ శవాలకు అంత్యక్రియలు, పేదలందరికీ నిత్యావసర వస్తువులను అందిస్తోంది. మౌలానా షరీఫ్ హుస్సేనీ ఆధ్వర్యంలో స్థాపితమైన హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ తమ సేవలను పూర్తి స్థాయిలో అన్నార్తులకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతోంది.ఆల్ ది బెస్ట్ హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ అండ్ టీం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement