Thursday, May 16, 2024

ఉచిత పశుకృత్రిమ గర్భధారణ పథకం..

తర్లుపాడు : మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జాతీయ ఉచిత పశుకృత్రిమ గర్భధారణ పథకం 2 కార్యక్రమంలో భాగంగా ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎదకు వచ్చిన గేదెలకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేయడం జరిగింది. ఎదకు రాని గేదెలకు తిరిగి పొర్లే గేదెలకు గర్భకోశ వ్యాధులకు చికిత్సను డిడిఏహెచ్‌ డా. బి. మహేశ్వరుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పశువుల లో చూడి నిర్థారణ పరీక్షలు మరియు చూడి పశువులు సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహేశ్వరుడు వివరించారు. ఏడిఏవిహెచ్‌ డా. బి.చిన్నబాలునాయక్‌ దూడలకు నట్టల నివారణ మందులు తాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డి. విష్ణువర్థన్‌రెడ్డి, విఏఎస్‌, వి.డి, మాజీసర్పంచ్‌ వై.రామిరెడ్డి, పశుసంవర్థక శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement