Sunday, May 12, 2024

రామాయ‌ప‌ట్నం పోర్టుపై చేతులెత్తిసిన కేంద్రం….

న్యూ ఢిల్లీ / ఒంగోలు – ఎపి ప్ర‌భుత్వ నిర్మాణ త‌ల‌పెట్టిన ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు ఎటువంటి సాయం చేయలేమని కేంద్రం తేల్చి చెప్పింది. రాజ్యసభలో బిజెపి స‌భ్యుడు టి.జి.వెంకటేశ్ రామాయంపేట పోర్టుపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. అందులో పోర్టు నిర్మాణానికి సహాయం చేయలేమని తేల్చి వేశారు. విభజన చట్ట ప్రకారం పెద్ద పోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రానిద‌ని అంటూ రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపింద‌ని గుర్తు చేశారు. నాన్‌ మేజర్‌ పోర్టుల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలకే ఉంటుంద‌ని అండులో కేంద్రం జోక్యం చేసుకోద‌ని అన్నారు. రామాయపట్నం అభివృద్ధి చేయాలంటే చట్టంలో మార్పులు తేవాల్సి ఉంటుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement