Friday, May 3, 2024

Political Story – స‌మ‌రానికి వైసిపి స‌న్నాహం – కేడ‌ర్… లీడ‌ర్ క‌లిస్తేనే ప‌వ‌ర్

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో సాధారణ ఎన్నికల సమ యం దగ్గరపడేకొద్ది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, సమస్య లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో చోటుచేసు కుంటున్న లోపాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగం గానే మండల స్థాయిలో ద్వితీయ స్థాయి నేతలు కొంతమంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారు ఏ కారణం చేత పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారో తెలుసుకుని వారు తిరిగి యథావిధిగా పార్టీ కార్యక్ర మాల్లో చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకొంటున్నారు. అందులో భాగం గానే పార్టీ సీనియర్‌ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనతో కలిసి ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేశారు. చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆ బృందం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గా ల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసు కుని వాటిని నివేదిక రూపంలో సీఎం జగన్‌కు సమర్పించనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైంది.

పార్టీ అధిష్టానానికి సర్వే నివేదికలు సమర్పించాక వారి సూచన ల మేరకు ఆయా నియోజకవర్గాల్లో అందరినీ సమన్వయం చేసే బాధ్యతలు కూడా చెవిరెడ్డికే అప్పగించినట్లు తెలు స్తోంది. అందులో భాగంగానే ఆయన పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే నియోజకవర్గ పరిశీలకులకు కూడా మరెన్ని అధికారాలను కట్టబెట్టారు. ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలో జరిగిన పరిశీలకుల సమావేశంలో ఆ దిశగా ఆయన వారికి దిశానిర్ధేశం చేశారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకు సుమారు 70 నియోజకవర్గాల్లో పరిశీలకులను మార్పు చేశారు. మొత్తం మీద చేర్పులు, మార్పుల తర్వాత 175 నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ప్రధానంగా 5 అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు, అధికారాలను కల్పించారు. నియోజకవర్గ పరిధిలో మంత్రి, ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్‌ లతో పరిశీలకులు సమన్వయం చేసుకొంటూ పార్టీకి దూరంగా ఉన్న సెకండ్‌ క్యాడర్‌ నాయకులను దగ్గర చేర్చే ప్రయత్నం చేసే బాధ్యతను కూడా అబ్జర్వర్‌లకే అప్పగించడాన్ని బట్టి చూస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అందరిలో ఐక్యతను నింపేలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకొంటున్నారు.

నియోజకవర్గాల్లో రహస్య సర్వే
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే ఐ-ప్యాక్‌, ఇంటెలిజెన్స్‌ నివేదికలను తెప్పించుకుని పరిశీలిస్తున్న సీఎం జగన్‌ తాజాగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో కూడా రహస్యంగా మరో సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయనకు ప్రత్యేకంగా కొన్ని అధికారాలతో పాటు టీంను కూడా ఏర్పాటు చేశారు. వారంతా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేస్తున్నారు. అన్నివర్గాలకు చెందిన ప్రజలను విచారించి ఆ దిశగా నివేదికలను రూపొందిస్తున్నారు. అలాగే పార్టీకి దూరంగా ఉంటున్న మండల స్థాయి నాయకులను కలుసుకుని వారు ఏ కారణం చేత కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో తెలుసుకుని వాటిని నివేదిక రూపంలో అధిష్టానానికి సమర్పించబోతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆ బృందం వివిధ కోణాల్లో సర్వే నిర్వహిస్తోంది. ఆ సర్వే నివేదికలను గతంలో ఇచ్చిన ఐ-ప్యాక్‌, ఇంటెలిజెన్స్‌ నివేదికలను పార్టీ అధిష్టానం పరిశీలించనుంది. ఆ తర్వాతే ఆయా నియోజకవర్గాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోనుంది.

ఐక్యత నింపే వ్యూహం
2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి నాయకులు జగన్‌ను సీఎంను చేయడానికి కష్టపడి పనిచేశారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కూడా తమ వంతు పాత్ర పోషించారు. అయితే వారిలో 30 శాతం మందికి పైగా ముఖ్య నాయకులు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం జిల్లాకు చెందిన మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి నేతలు జిల్లాకు వచ్చిన సందర్భంలో మాత్రమెె వారు మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లిపోతున్నారు. ఆయా సంద ర్భాల్లో తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం కొంతమంది చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. జిల్లా నేతలు కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ద్వితీయ స్థాయి నేతలకు అభయ హస్తం ఇవ్వలేకపోతున్నారు.

దీంతో ముఖ్యమైన నాయకులు గత కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. అటువంటి వారందరిలో ఐక్యతను నింపి వారిని అక్కున చేర్చుకునేలా సీఎం జగన్‌ వ్యూహాత్మకంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని రంగంలోకి దించారు. పరిశీలకులకు కూడా ఆ దిశగా కొన్ని బాధ్యతలను అప్పగించారు. ఇన్‌చార్జ్‌ లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో విభేదాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నేతలు స్థానికంగా ఉన్న మండల స్థాయి నాయకుల గురించి పట్టించుకోవడం లేదు. కనీసం వారిని పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్తున్నా వారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో సీఎం జగన్‌ స్వయంగా ఆ తరహా నియోజకవర్గాలపై ఫోకస్‌ పెడుతున్నారు. ప్రత్యేక సర్వే నివేదికల ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఐక్యతను నింపే ప్రయత్నం చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement