Wednesday, May 15, 2024

Top Story – అప్పుల ప‌రిమితిలో తెలంగాణ దేశానికే దిక్సూచి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తొమ్మిదిన్నరేళ్లలోనే అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరిన తెలంగాణపై అప్పుల పేరుతో అసత్యాల అక్కసు పెరుగుతోంది. ఇదే అంశాన్ని కాగ్‌ వెల్లడించింది. అదేకోవలో అచిరకాలంలోనే తెలంగాణ స్టేట్‌ అప్పుల రీ పేమెంట్‌, వడ్డీల చెల్లింపుల్లో దేశానికే తెలంగాణ మార్గదర్శిగా ఉందని ఆర్బీఐ కూడా తెలంగాణను కీర్తించింది. అప్పుల అంశంలో దేశంలోని రాష్ట్రాలన్నింటికంటే తెలంగాణ 23వ స్థానంలో ఉంది. జీఎస్డీపీ పరిమితికి మించి ఏనాడూ అప్పులు చేయలేదు. ఆర్ధిక క్షీణత ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఏనాడూ లేదని ఆర్భీఐ పేర్కొంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ వేదికగా అధికారికంగా వెల్లడించింది. ఈ హెచ్చరికల జాబితాలో యూపీ, మధ్యప్రదేశ్‌, హర్యానా, బీహార్‌, ఏపీ, పంజాబ్‌, రాజస్థాన్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌లు ఉన్నాయి. 2015లో తెలంగాణ రూ. 5227కోట్ల వడ్డీలు చెల్లించగా, 2021లో రూ. 14615కోట్లను చెల్లించింది. 2022లో రూ. 16వేలకుపైగా చెల్లింపులు చేసింది.

అభివృద్ధి పనులకు కేటాయింపులు, ఖర్చుల్లో రోల్‌మోడల్‌…
కేంద్రమెంత నియంత్రించినా తెలంగాణ స్వయం సమృద్ధి, స్వావలంభనతో ముందంజ వేస్తోంది. రాబడుల్లో సింహ భాగాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ఖర్చు చేస్తోంది. ప్రజల ఆదాయాన్ని పెంచి ఆర్ధిక వృద్ధి రేటును రికార్డు స్థాయికి పెంచుకుంటున్నది. గడచిన తొమ్మిదిన్నరెళ్లుగా బడ్జెట్‌లో అభివృద్ధి పనులకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానంలో నిల్చింది. 2022-23లో రూ. 2.56లక్షల కోట్ల బడ్జెట్‌లో 77.4 శాతం(రూ. 1.98 లక్షల కోట్లు)అభివృద్ది వ్యయాలు చేసింది. సంపద పెంచి ప్రజ లకు పంచేలా తెలంగాణ సర్కార్‌ చేస్తున్న ధీర్ఘకాలిక వ్యూహాలు సత్ఫలితాలని స్తున్నాయి. పెట్టుబడులకు అప్పులు చేస్తూ, వాటిని ఉత్పాదక రంగాలకు వెచ్చిం చడం, సంపద సృష్టించడం లో తెలంగాణ రాష్ట్రం జాతీయ దృష్టిని ఆకర్శిస్తోంది. జీఎస్‌డీలో అప్పుల శాతం 25కు పెంచుతూ కేంద్రం అనుమతించినా నిబంధన లకు లోబడే రుణాలు సేకరించడం, అది అతి తక్కువ వడ్డీలకు తీసుకోవడం తెలంగాణకే చెల్లుతోంది. 2021-22 వార్షిక ఏడాదిలో 21శాతానికి రుణాలను పరిమితం చేయగా, వాస్తవంగా ఇవి ఏడాది ముగింపుకు 17శాతంలోనే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.

ఉత్పత్తి రంగాలకు పెద్దపీట…
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలకు, ఇతర నిర్మాణాత్మక రంగాలకు రుణాలను తీసుకొస్తున్నది. అయితే వీటిని వృధా రంగాలకు కాకుండా ఉత్పత్తి రంగాలకు, సంపద సృష్టికి వినియోగిస్తున్నది. దీంతో రాష్ట్రంలో సంపత, ప్రజల జీవన ప్రమాణం మెరుగవుతున్నది. అయితే తాజా అప్పు లను తిరిగి చెల్లించేం దుకు 25ఏళ్లకుపైగా సమయం ఉన్నది. ద్రవ్యలోటు మొత్తంలో జీఎస్‌డీపిలో ద్రవ్యలో టు 3నుంచి 4.5 శాతంగా ఉండొచ్చు. కానీ దీనిని 2.53 శాతానికే తెలంగాణ పరి మితం చేసుకుంది. 2016-17లో రాష్ట్రం తీసుకున్న అప్పు రూ. 131531కోట్లుకాగా, జీఎస్‌డీపీ 659033 ఉండగా జీఎస్‌డీపీలో అప్పుల శాతం 20.04గా నమోదైంది. 2017-18లో అప్పు రూ. 1,52,180కోట్లుకగా, జీఎస్‌డీపీ 753811గా ఉంటూ జీఎస్‌డీపీలో అప్పుల శాతం 20.23గా ఉంది.

2018-19లో 1,79,795 తీసుకోగా, జీఎస్‌డీపీ 865688గా ఉంటూ ఇందులో అప్పుల శాతం 20.77గా ఉంది. ఇక 2019-20లో రూ. 2,03,730కోట్ల అప్పుతో జీఎస్‌డీపీ 9,50,000ల అంచనాతో జీఎస్‌డీపీలో 17శాతంగా అప్పులు నమోదయ్యాయి. అంటే ఈ ఏడాది అప్పుల శాతం తగ్గింది. మరోవైపు ప్రభుత్వ పెట్టుబడులు, ముందుచూపుతో ప్రజల సంపద, స్వశక్తి అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయన్న వాదన నిజంకాకపోగా, మరోవైపు రెవెన్యూ వసూళ్లకంటే వడ్డీ చెల్లింపులు మించరా దన్న పరిమితిని ఏనాడూ దాటలేదు. ఏ రాష్ట్రమైనా తన పన్నుల రాబడికంటే 10శాతానికి మించి రుణాలపై వడ్డీలకు చెల్లింపులు చేయరాదని ఎప్‌ఆర్‌బీఎం చట్టం చెబుతున్నట్లుగా, తెలంగాణ రాష్ట్రం స్థిర ఆర్ధిక వృద్ధిరేటును సాధిస్తున్నట్లుగా ఈ నిబంధనతో స్పష్టమవుతోంది. జీఎస్‌డీపీలో 3.5 శాతానికి మించి అప్పులు చేయరాదని షరతు ఉంది. రెవెన్యూ మిగులు అధికంగా ఉన్న తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలకు మాత్రం 3.5 శాతం రుణ సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. మిగులు రాష్ట్రాలుగా ఘనతను సాధించడంతో ఈ మేరకు కేంద్రం ఈ వెసులుబాటును వర్తింపజేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులపై వడ్డీలకు చెల్లింపులు రాబడుల్లో 10శాతంలోపే ఉండాలన్న షరతును పక్కాగా అమలు చేయడంతో భవిష్యత్‌ అప్పులపై ఢోకా లేకుండా పోయింది. అప్పుల తిరిగి చెల్లింపులకు 25 ఏళ్లపాటు సమయం చిక్కి, వడ్డీల భారం కూడా తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement