Friday, April 26, 2024

మా పరిహారం సంగతేంటి?.. పోలవరంలో మంత్రి అనిల్‌కు చేదు అనుభవం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు స్థానిక నేతలతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్న మంత్రి అనిల్.. ప్రాజెక్టు పనుల పురిగతిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అయితే, పోలవరం పర్యటనలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఇంతవరకు అర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని పేర్కొంటూ కొందరు నిర్వాసితులు నిరసన తెలిపారు. పరిహారం పూర్తిగా ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పాతపైడిపాక గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందలేదని పేర్కొంటూ గ్రామంలోనే ఉంటున్నాయి. అయితే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయాలని అధికారులు పలుమార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలవరం పర్యటనకు వచ్చిన మంత్రిని వద్ద ఆందోళన చెశారు. పరిహారం విషయాన్ని దృష్టికి తీసుకెళ్లారు. దాంతో బాధితుల సమస్యను వెంటనే పరిష్కరిస్తానని మంత్రి అనిల్ హామీ ఇచ్చారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement