Saturday, April 27, 2024

పెన్నా ఉగ్ర‌రూపం.. రోడ్లన్నీ జలమయం.. జొన్నవాడకు రాకపోకలు బంద్​..

నెల్లూరు జిల్లాను వానలు వీడలేదు. భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో సింహపురి తల్లడిల్లుతోంది. పెన్నానదికి పెద్ద ఎత్తున వరదపోటెత్తుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో వరద ముప్పు ఉందని స్థానిక గ్రామాల ప్రజలు అంటున్నారు. చాలా గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. కాగా, జొన్నవాడ కామాక్షమ్మ గుడికెళ్లే దారి మొత్తం నీటితో నిండిపోయింది. పెన్నా పరివాహక ప్రాంతం కావడంతో నీరంతా రోడ్లపైనే పారుతోంది.

జొన్నవాడ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బుచ్చిరెడ్డిపాళెం నుండి గాని, నెల్లూరు నుంచి గాని వచ్చే అవకాశం లేకుండాపోయింది. వరద ఉధృతి వల్ల రోడ్లన్నీ జలమం అయ్యాయి. దొడ్ల డైరీ వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నుండి జొన్నవాడ వచ్చే మార్గంలో పెనుబల్లి వద్ద రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటువైపు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలు రద్దు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement