Monday, April 29, 2024

AP: చంద్రబాబు కోసం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పీలా పూజలు…

కశింకోట, సెప్టెంబర్16 (ప్రభ న్యూస్): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అక్రమంగా కేసులు బనాయించి రిమాండ్‌లో ఉంచడం వైసీపీ ప్రభుత్వ కుట్ర అని, తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ యువ నాయకులు కాండ్రేగుల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి, ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా పీలా మాట్లాడుతూ… టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా ఎంతో మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చారన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరుగలేదని ఆ కంపెనీ యజమానులే చెప్తున్నా కూడా చంద్రబాబును కావాలని కక్ష్యతో, తప్పుడు కేసులతో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. ఎంతో మంది యువత స్కిల్‌ డెవలప్ మెంట్ ద్వారా ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల వేతనాలతో ఆనందంగా జీవితాలు గడుపుతున్నారన్నది కూడా రుజువు అయిందన్నారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయి పక్కాగా లెక్కలు ఉంటే దానిని బయట పెట్టకుండా, ఆధారాలు చూపకుండా వైసీపీ ప్రభుత్వం జ్యుడిషియల్‌ వ్యవస్థను కూడా తమ ఆధీనంలో ఉంచుకుందని ఆరోపించారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టును చిత్తశుద్ధితో, నిబద్దతతో చంద్రబాబు అమలు చేశారన్నారు. టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రజాబలం, అండతో రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

వైసీపీ కుటిల రాజకీయ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబుపై మోపినవన్నీ తప్పుడు ఆరోపణలు, అక్రమ కేసులని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. అందుకే బాబుకు తోడుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల తెలుగు ప్రజలు ఉన్నారన్నారు. వారందరికీ కృతజ్ఞతలని పీలా అన్నారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోగా, ఒక్క కంపెనీని తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని జగన్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధిపైనా, తెచ్చిన కంపెనీలపై అవినీతి ఆరోపణలు చేస్తూ మచ్చ తెచ్చేందుకు కుట్ర చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వచ్చే వరకూ దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో బాగుపడిన యువత సైతం రోడ్డుమీదికి వచ్చి చేసిన మంచిని చెప్తున్నా జగన్‌ వినిపించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాయల మురళీధర్, ఉగ్గిన రమణ మూర్తి, గొంతిన శ్రీనివాసరావు, సిదిరెడ్డి శ్రీనివాసరావు, ఆడారి నర్సింగరావు, పెంటకోట సుబ్బలక్ష్మి, పెంటకోట రాము, జేరిపోతుల నూకినాయుడు, పెంటకోట తాతారావు, తకాశి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement