Saturday, April 27, 2024

చంద్రబాబు చేతుల్లోనే పవన్ రిమోట్… సజ్జల

పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లో ఉంటుందని, చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే చేస్తాడని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సబ్ ప్లాన్ నిధులపై పవన్ ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నామన్న ఆయన మూడేళ్లలో సీఎం జగన్ రూ.48 వేల కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. కేవలం డీబీటీ ద్వారానే రూ.30వేల కోట్లు ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చామన్నారు. ఎస్టీ, ఎస్సీలకు జగన్ అన్ని రకాలుగా తగిన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. సకల శాఖల మంత్రి అని పవన్ తనపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పొత్తులపై పవన్ మూడు ఆప్షన్స్ చూస్తే నవ్వు వస్తోందన్న సజ్జల చంద్రబాబుకు సపోర్ట్ చేయడం నాలుగో ఆప్షన్ గా చెప్పాల్సిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement