Saturday, April 20, 2024

ఫస్ట్ డే రూ.100కోట్లు వసూళ్లు రాబట్టిన.. పఠాన్

నాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపిక పదుకొణే నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం ప‌ఠాన్.. బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ ను తట్టుకున్న ఈచిత్రం మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాంతో తొలిరోజు అత్యధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమా గా రికార్డు సృష్టించింది. భారత మార్కెట్ లోనే రూ. 67 కోట్ల గ్రాస్ రాబట్టింది. విదేశాల్లో రూ. 35 కోట్ల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒక్కరోజే రూ. 102 కోట్లు వసూలు చేసింది. య‌శ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు 53. 9 కోట్ల క‌లెక్ష‌న్స్ తో రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆ రికార్డును పఠాన్ బద్దలు కొట్టింది. మొత్తానికి షారుక్ ఖాన్ కి ఉన్న క్రేజ్ మరోసారి నిరూపించారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement