Thursday, May 16, 2024

ఒంగోలు టు చెన్నై.. డ్రగ్స్ రాకెట్ చిక్కిందిలా..

చెన్నైలో తీగలాగితే ఒంగోలులో డ్రగ్స్‌ డొంక కదిలింది. ఒంగోలు పారిశ్రామికవాడలో డ్రగ్స్‌లో వినియోగించే రసాయన పొడి తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోడౌన్‌ పై దాడి చేసిన పోలీసులు ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులోని ఇండస్ట్రీయల్‌ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరం పై చెన్నై పోలీసులు దాడి చేశారు. పారిశ్రామికవాడలోని గోడౌన్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గోడౌన్‌ను సీజ్‌ చేశారు. అక్కడ నిషేధిక పదార్ధామైన మెథాపాటెమిన్‌ అనే డ్రగ్స్‌ను గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆరు రోజుల క్రితం చెన్నైలో మెథాంఫెటమైన్‌ డ్రగ్‌ తీసుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు., ఇది ఎక్కడి నుంచి వచ్చింది..? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో వారిని విచారించారు. ఆ సమయంలో ఒంగోలు తయారీ కేంద్రం గుట్టు బయటపడింది. దీని మూలాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడకు కూడా ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం. మత్తుపదార్థాలు బయటపడిన కేంద్రంలో రెండేళ్ల క్రితం వరకు ఒంగోలుకు చెందిన పెంట్యాల బ్రహ్మయ్య అనే వ్యక్తి విస్తరాకుల తయారీ నిర్వహించేవాడు. విజయ్‌, వెంకటరెడ్డి అనే వ్యక్తులు దీన్ని అద్దెకు తీసుకొని.. ఎవరికి అనుమానం రాకుండా మాదక ద్రవ్యాలు తయారు చేసి చెన్నైతో పాటు, హైదరాబాద్‌, బెంగుళూర్‌ ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement