Saturday, May 4, 2024

Nominations – ఎపి, తెలంగాణ‌లో నామినేష‌న్ల జోరు…

ఎపి తెలంగాణ‌ల‌లో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో కోలాహలం నెలకొంది.

ఏపీలో పిఠాపురం జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, గుడివాడ అసెంబ్లీ టిడిపి అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్‌ దాఖలు చేశారు. ధర్మవరం అభ్యర్థిగా సత్యకుమార్‌ (భాజపా), చిలకలూరిపేట నుంచి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (తెదేపా), నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి (వైకాపా) నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.

తెలంగాణ‌లో..

తెలంగాణలో పలువురు లోక్‌సభ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చేవెళ్ల స్థానం నుంచి రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్‌), కాసాని జ్ఞానేశ్వర్‌ (భారాస) నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు. నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి (కాంగ్రెస్‌) నామపత్రాలను సమర్పించారు. ఖమ్మం ఎంపీ స్థానానికి కాంగ్రెస్‌ నేత రఘురాంరెడ్డి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందించారు. అయితే ఖమ్మం స్థానంలో అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

నామినేషన్ దాఖలు చేసిన మాలోతు కవిత

మహబూబాబాద్‌ పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా మాలోతు కవిత రెండు సెట్లతో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అధ్వైత్‌ కుమార్ సింగ్‌కి అందజేశారు

నల్గొండలో కంచర్ల..

నల్లగొండ‌ పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి రెండు సెట్లతో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందనకు అందజేశారు.

అదిలాబాద్ లో ఆత్రం సక్కు

ఆదిలాబాద్‌ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా ఆత్రం సక్కు రెండు సెట్లతో తన నామినేష పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు

 ‘బర్రెలక్క’ నామినేషన్‌..

నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బర్రెలక్క నేడు నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement