Saturday, May 4, 2024

కొత్త జిల్లాల‌కు నో ప్రయారిటీ.. మంత్రి వ‌ర్గంలో ఎనిమిది జిల్లాల‌కూ ద‌క్క‌ని ప్రాతినిథ్యం

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మంత్రి వ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో కొత్త‌గా ఏర్ప‌డ్డ ఎనిమిది జిల్లాల‌కు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. సీఎం జగన్‌ మంత్రివర్గ విస్తరణలో 8 కొత్త జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. వీటిలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలున్నాయి. అయితే.. కొన్ని కొత్త జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ మందికి మంత్రి పదవులు ద‌క్క‌డ గ‌మ‌నించద‌గ్గ విష‌య‌మ‌ని పొలిటిక‌ల్ అన‌లిస్టులు అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు.. కోనసీమలో చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్, ప.గో.జిల్లాలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ.. పల్నాడు జిల్లాలో అంబటి రాంబాబు, విడదల రజని.. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఆర్‌కే రోజాకు మంత్రి పదవులు దక్కాయి. అన్ని జిల్లాల‌కు స‌మాన ప్రాతినిథ్యం క‌ల్పిస్తామ‌న్న సీఎం జ‌గ‌న్ త‌న మాట‌ను తానే నిల‌బెట్టుకోలేద‌ని, మ‌డ‌మ తిప్ప‌ను, మాట త‌ప్ప‌ను అంటూనే ఏపీ ప్ర‌జ‌ల‌ను వంచిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, వైఎస్సార్‌సీపీ పార్టీలోని చాలామంది లీడ‌ర్లు త‌మ అభిమాన ఎమ్మెల్యేలకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో రాజీనామాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది పార్టీలో అసంతృప్తిని మ‌రింత ర‌గిలించేలా ఉంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement