Monday, May 6, 2024

పంచాయితీల‌కు నిధుల దిక్కేది….

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు వచ్చిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకోవడంతో గ్రామపంచాయతీలు వట్టిపోయాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం యూసీలు సమర్పించలేకపోయింది. దీంతో 2022-23 సంవత్సరానికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రూ.2010 కోట్లు- ఇవ్వకుండా నిలిపి వేసింది. ఈ నెలాఖరు నాటికి ఈ నిధులు రాకపోతే ఇక ఆశ వదులుకోవాల్సిందేనంటు-న్నారు. గ్రామ పంచాయతీలకు 2019-20 సంవత్సరానికి రూ.2118 కోట్లు-, 2020-21 సంవత్సరానికి రూ.1837 కోట్లు-, 2021-22 సంవత్సరానికి రూ.1917 కోట్లు- విడుదలయ్యాయి. ఆ నిధులన్నింటినీ ప్రభుత్వం వాడేసుకోవడం వల్ల పంచాయతీలు కేంద్రం దృష్టిలో బ్లాకులిస్టులో పడ్డాయంటు-న్నారు. దీంతో పాటు- రాష్ట్ర ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు- చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మెలిక పెట్టిందని చెప్తున్నారు.

రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు- చేసేదాకా నిధులివ్వబోమని కేంద్ర అధికారులు చెప్తున్నట్లు- సమాచారం. తాగునీటి అవసరాలకు సైతం సర్పంచులు తమ జేబులో నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటు-న్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఒక్కపైసా విడుదల చేయకపోయినా కేంద్రం నుంచి లభిస్తున్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు వ్యయం చేస్తున్నది. కాగా 14, 15వ ఆర్థిక సంఘం నిధులు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అందలేదని సర్పంచులు చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో రూ.7659 కోట్లు- 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇచ్చినట్లు- రాజ్యసభలో వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేశ్వర్‌ ఇటీ-వల రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అయితే, ఈ నిధులు పంచాయతీ ఖాతాల్లో కనిపించడం లేదని, పంచాయతీ సీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపెడుతున్నాయని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి 2018 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రిల్‌ 2 వరకు పంయతీ ఎన్నికలు జరగకపోవడంతో సర్పంచులు అధికారంలో లేరు. ఆ తర్వాత ఎన్నికలు జరిగి నూతన సర్పంచులు 2021 ఏప్రిల్‌ 2న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కూడా పంచాయతీ సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కనిపించలేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించనందున 2018-2021 మధ్య కాలంలో నిధులు విడుదల చేయలేదని, అందుకే ఈ మూడేళ్లలో పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఇప్పటి వరకు అందరూ భావించారు.

అయితే రాష్ట్రాన్రికి రూ.7,659 కోట్లు- విడుదల చేశామని విజయసాయిరెడ్డి ప్రశ్నకు పార్లమెంటులో మంత్రి జవాబివ్వడంతో అసలు విషయం వెల్లడైంది. ఈ విషయమై తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ప్రభుత్వం ఆ నిధులు జమచేసి ఉంటే సీఎఫ్‌ఎంఎస్‌ ఖాతాల్లో ఎందుకు కనిపించడంలేదని, జీరో బ్యాలెన్స్‌ ఎందుకు చూపిస్తున్నాయని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచులు ఎన్ని-కై-న కొత్తలో రూ.345 కోట్లు- ఓ సారి, రూ.969 కోట్లు- మరోసారి సర్పంచులకు తెలియకుండా విద్యుత్‌ ర్జీల కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని, దారి మళ్లించి సీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ చూపించారని సర్పంచులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల నిధులను పంచాయతీలకే ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు పార్టీలకతీతంగా పోరాటాలు చేపట్టారు. సొంత పార్టీ సర్పంచులు సైతం నిరసన తెలిపినా ప్రభుత్వం వెరవలేదు. దీంతో రాష్ట్రంలో పోరాటాలు చేసి అవమానాలపాలైన సర్పంచులు కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి తలుపుతట్టారు. అయినా స్పందించకపోవడంతో కొంత మంది సర్పంచులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అధికారపక్షం, ప్రతిపక్షాల సర్పంచులు సైతం వేరు వేరు అసోసియేషన్లు ఏర్పాటు-చేసుకుని పోరాటాలకు దిగారు. దీంతో అధికారపక్షం 175 నియోజకవర్గాల నుంచి ఒక్కో సర్పంచిని తాడేపల్లికి పిలిపించి వైసీపీకి అనుబంధంగా మరో సర్పంచుల సంఘాన్ని ఏర్పాటు- చేసుకుంది. దీంతో వైకాపాకు సానుభూతిపరులుగా ఉన్న సర్పంచులు సైతం ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీల నిధులు ప్రభుత్వం నుంచి రాబట్టేదాకా వెనుకాడేది లేదని సర్పంచుల అసోసియేషన్‌ స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement