Thursday, May 2, 2024

దిక్కు లేని రాష్ట్రం ఏపీ.. పార్లమెంట్ సాక్షిగా పరువు తీశారన్న టీడీపీ ఎంపీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పరువును పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీలే తీసేశారని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల ఎద్దేవా జచేశారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జీతాలకు కుడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి సహా ఏపీ దుస్థితి ఎలా ఉందో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ పార్లమెంట్ వేదికగా చెప్పారన్నారు. గత ప్రభుత్వం అప్పులతోనే తమకు ఇబ్బందులు వచ్చాయని పార్లమెంట్ వేదికను తప్పుదారి పట్టించేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3లక్షల 8వేల 04కోట్లు అప్పు చేశారని,
కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లించారని కనకమేడల ధ్వజమెత్తారు. ఏపీ ఆర్ధిక స్థితిని దివాళా తీయించారని, కట్టని ఇళ్లపై కూడా పన్ను వేస్తున్నారని ఆరోపించారు. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడానికి జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణమని, 2లక్షల కోట్ల రాజధాని ఆస్తిని అయోమయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, అడిగితే సంక్షేమ పథకాలకు ఇస్తున్నామoటున్నారని, అదంతా బోగస్ అని కనకమేడల రవీందర్ కుమార్ విమర్శించారు. ఏపీ దిక్కులేని, రాజధాని లేని రాష్ట్రమైందని, వైసీపీ ప్రతి అడుగు వినాశనానికే దారి తీస్తుందని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement