Friday, April 19, 2024

ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల‌పై ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్‌..

ప్ర‌భ‌న్యూస్: వచ్చే నెల జనవరి 1 నుంచి ఏటీఎం క్యాష్‌ విత్‌డ్రాయల్‌ ఛార్జీలు పెరిగే అవకాశాలున్నాయి. నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి దాటితే వినియోగదారుల అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈ ఏడాది జూన్‌లోనే బ్యాంకులకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. నెలవారీ ఉచిత క్యాష్‌, నాన్‌- క్యాప్‌ ఏటీఎం లావాదేవీలు మించితే ఛార్జీలను పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అధిక ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు, సాధారణ నిర్వహణ వ్యయాల దృష్ట్యా బ్యాంకులకు పరిహారంలో భాగంగా ఒక్కో లావాదేవీపై ప్రస్తుత ఛార్జీ రూ.20 ఉండగా దానిని రూ.21కి పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.

రూ.21 ఛార్జీతోపాటు అదనంగా జీఎస్టీ కూడా వర్తిస్తుంది. ఈ కొత్త ఛార్జీని బ్యాంకులు జనవరి 1, 2022 నుంచి అమలు చేసే అవకాశాలున్నాయి. నెలలో 5 ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. కాగా బ్యాంకులు ప్రస్తుతం నెలకు 5 ఉచిత ఏటీఎం లావాదేవీలను కస్టమర్లకు అందిస్తున్నాయి. మెట్రో నగరాలకు చెందిన కస్టమర్ల తమ బ్యాంకు నుంచి కాక ఇతర బ్యాంకుల నుంచి 3 ఉచిత లావాదేవీలు, నాన్‌ – మెట్రో నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement