Sunday, April 28, 2024

ఈ నెల 21 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు..

ఏపీలో నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ప్రభుత్వం. కరోనా కట్టడిలో భాగంగా ఈ నెల 21 వరకు ఆంక్షలు అమలులో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలుంటాయని స్పష్టం చేసింది. ఏపీలో కోవిడ్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ప్రజలు కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆ‍యన ఆదేశించారు. జన సమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయన్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,535 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 2,075 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ప్రతి ఒక్కరికీ దళిత బంధుః సీఎస్ సోమేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement