Monday, April 29, 2024

NIA – తెలుగు రాష్ట్రాల్లో NIA ఆకస్మిక సోదాలు… మానవ హక్కుల ఉద్యమ నేతలే టార్గెట్

హైదరాబాద్ / అమరావతి – తెలుగు రాష్ట్రాల్లో NIA ఆకస్మిక సోదాలు నిర్వహిస్తోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టిన NIA.. తనిఖీలు చేస్తోంది. హైదరాబాద్‌లోని అమరుల బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంటిపై దాడి చేశారు అధికారులు. అలాగే.. తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులు, న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో సోదాలు చేపట్టారు. విద్యానగర్‌లో అడ్వొకేట్ సురేష్ ఇంట్లో తనిఖీలు చేశారు. అటు.. నెల్లూరులోనూ NIA సోదాలు కొనసాగుతున్నాయి.

ఉస్మాన్ సాహెబ్‌పేటలోని APCLC జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు నివాసంలో తనిఖీలు చేపట్టారు NIA అధికారులు. రెండు దశాబ్ధాలుగా పౌరహక్కుల ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు ఎల్లంకి వెంకటేశ్వర్లు. నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎల్లంకి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. ఇక.. గుంటూరు జిల్లా పొన్నూరులోనూ NIA తనిఖీలు జరుగుతున్నాయి. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.

డా.టి రాజారావు ఇంట్లో ఎన్‌ఐఏ బృందం సోదాలు చేపట్టింది. తెల్లవారుజామునే రాజారావుకు చెందిన ప్రజా వైద్యశాలకు ఎన్‌ఐఏ అధికారులు చేరుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోదాల నేపథ్యంలో రాజారావు ఇల్లు, హాస్పిటల్‌ పరిసరాల్లో ప్రత్యేక బలగాలు భారీగా మోహరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement