Saturday, May 4, 2024

Nandyala : ఆళ్లగడ్డలో ఎన్ఐఏ సోదాలు

ఆళ్లగడ్డలోని కొత్త మసీద్ వీధిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) సోదాలు నిర్వహించారు. ఉగ్రవాద కార్యక్రమాల నిర్వహణలో పాల్గొంటున్నాడన్న అనుమానంతో పిఎఫ్ఐలో పనిచేసిన యూనస్ ను ఎన్ ఐ ఏ పోలీసులు మూడు నెలల కిందట కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.

యూనస్ భార్య ఆఫ్రిన్ ప్రస్తుతం ఆళ్లగడ్డలో తన తల్లితో కలిసి ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున యూనస్ భార్య ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి, యూనస్ భార్యతో పాటు ఇంట్లో వారందరిని పోలీసులు విచారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement