Thursday, April 25, 2024

మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు… రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు…

ముత్తుకూరు – కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతంలో మత్స్యకారులకు జెట్టీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం మండలంలోని కృష్ణ పట్నం గ్రామపంచాయతీ ఆర్కాటి పాలెం గ్రామం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకారంతో మత్స్యకార కుటుంబాలతో సమావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర శాసనమండలి సభ్యులు గంగుల ప్రతాప్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్ర నాథ్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బీద మస్తాన్ రావు, మండల వైసీపీ కన్వీనర్ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ నెల్లూరు శివ ప్రసాద్, స్థానిక సర్పంచ్ మోచర్ల వజ్రమ్మ, ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు పామంజి వెంకటేశ్వర్లు, ప్రళయకావేరి రాములు, కటారి బాలకృష్ణ, అక్కయ్యగారి మొలక య్య, గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ,. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైకాపా ఎంపీ అభ్యర్థి గురు మూర్తి ని గెలిపించాలని మంత్రి కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అపారమైన గౌరవం కల్పిస్తూ పాలన చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల అడగడం సిగ్గుచేటని ఏ మొహం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని మంత్రి విమర్శించారు, మత్స్యకారులు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసే విధంగా తీర్మానం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలలను అభివృద్ధి చేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పిస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, జగన్ పరిపాలన లో పేదలు సుభిక్షంగా చదువుకుంటూ ఉన్నారని మంత్రి పేర్కొన్నారు, మత్స్యకారులకు సబ్సిడీపై డీజల్ అందిస్తున్నామని తెలియజేశారు. మత్స్యకార కుటుంబాలు అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మంత్రి అప్పల రాజు ను గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement