Thursday, May 6, 2021

నిజాంపట్నం టు బాపట్ల – పేకాట కేంద్రాలుగా రిసార్ట్స్, లాడ్జీలు..

బాపట్ల టౌన్ – పేకాట అంటే మొన్న వరకూ నిజాంపట్నం కేంద్రంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా నిజంపట్నం తీరం నుంచి సూర్యలంక తీరం కు చేరింది. గుట్టుచప్పుడుగా పేకాట నిర్వహిస్తూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సన్నీ రిసార్ట్స్ మారింది. కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నాయంటే పేకాట ఏ విధంగా జరుగుతుందో ప్రజలకు అర్థం అర్థమవుతుంది. డబ్బులు లెక్క వేయడానికి మిషన్ ఏర్పాటు చేశారంటే అర్థం చేసుకోవాలి. నిజాంపట్నం గ్రామానికి చెందిన మోపిదేవి నాగరాజు,కన్నా వెంకట ప్రసాద్, పశ్చిమగోదావరి కి చెందిన వెంక పరరాజు,రేపల్లె కు చెందిన సుబ్బారావులు పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇరువురు నిజాంపట్నంలో కూడా పేకాట నిర్వహిస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయని పోలీసులు వ్యక్తం పరిచారు. నిజాంపట్నం పరిసర ప్రాంతాలలో పేకాట స్థావరాలపై తీవ్రంగా దాడులు చేసి పేకాటలు జరగాకుండా కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో బాపట్లకు పేకాట మకాం మార్చి విద్యా కేంద్రంగా ఉన్నా బాపట్లను పేకాట అడ్డాగా పేకాటరాయుళ్ల మార్చారు. పేకాట లో డబ్బులు పోయి ఆడడానికి అవకాశం లేని వారికి కూడా ఈ పేకాట కేంద్రంలోనే ప్రాంసరీ నోటు పై సంతకాలు చేయించుకొని,ఎదుటవారి ఆర్థిక స్తోమతను బట్టి కావాల్సినంత డబ్బు ఇస్తున్నట్లు తెలిసింది.కొన్ని ప్రాంసరీ నోట్లు కుడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పేకాట లో పట్టుకున్న వారి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా చిన్న పాటి పేకాటలో పలువురుని అదుపులోకి తీసుకొని రూ.వెయ్యి,రెండు వేలు ఉన్నప్పటికీ వారి వాహనాలను కూడా అదుపులోకి తీసుకునే పోలీసులు తాజాగా జరిగిన పేకాట దాడులలో వాహనాలను స్వాధీనం చేసుకోకపోవడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేకాటరాయుళ్ల కూ కొందరు పోలీస్ శాఖలో కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.రేంజ్ డిఐజీ,జిల్లా ఎస్పీ స్వయంగా పేకాట రాయుళ్లను విచారణ చేస్తే పోలీస్ శాఖలో సహకరిస్తున్న వారి పేర్లు బయటపడే అవకాశం ఉందనే మాటలు వినబడుతున్నాయి.

అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా రిసార్ట్స్
అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా సన్ని రిసార్ట్స్ మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వ్యభిచారం పేకాట నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే రిసార్ట్స్లో రేవ్ పార్టీలు కూడా జరిగాయి.విద్యా కేంద్రంగా ఉన్నా బాపట్లలో రిసార్ట్లు ఏర్పాటుచేసి నిర్వాహకులే వ్యభిచారం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలకు వివరంగా అర్థం అవుతుంది. ఇప్పటికైనా పోలీసులు రిసార్ట్స్, లాడ్జి లపై నిత్యం తనిఖీలు చేస్తూ పేకాట, వ్యభిచారాలు లేకుండా చేయాలని సూర్యలంక వచ్చే పర్యాటకులతో పాటు, బాపట్ల ప్రజలు కోరుతున్నారు.

34 మంది ని అరెస్ట్ చేశాం డిఎస్పీ వెల్లడి
పేకాట స్థావరం పై దాడులు చేసి 34 మందిని అరెస్ట్ చేసి,రూ.24లక్షల,70వేల,మూడు వందల 80 ను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పేకాట నిర్వహిస్తున్న నిజంపట్నం కు చెందిన మోపిదేవి నాగరాజు,కన్నా వెంకట ప్రసాద్,వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వెంక పరరాజు,సుబ్బారావులతో పాటు,పేకాట‌ లో పాల్గొన్న వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల కాలం లో పేకాట‌లో పెద్ద మొత్తం నగదు పట్టుకున్న సంఘటన ఇదే అన్నారు. ఎక్కడైనా అంసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎంతటి వారిపైన ఆయన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసరెడ్డి,యస్ఐలు కిరణ్,రాజశేఖర్,జనార్దన్,అంజయ్య లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News