Sunday, May 19, 2024

Nellore : ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. కింద‌ప‌డిన టీడీపీ అభ్య‌ర్థి

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి.. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రచారంలో మాటల యుద్ధం, ఘర్షణకు దారి తీస్తోంది.. కొన్నిసార్లు సహనం కోల్పోయి దాడి, ప్రతి దాడులు చేసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు.. ఇక ఇవాళ‌ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.. చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో టీడీపీ ప్రచారం ఉద్రిక్తతకు కారణమైంది.

ఎన్నికల ప్రచారం కోసం గ్రామానికి వెళ్లారు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీ నాయుడు.. అయితే, గ్రామంలో పాత టీడీపీ వర్గాన్ని పట్టించుకోకుండా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలో కొత్తగా చేరిన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంతో వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది.. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీ నాయుడుపై ఓ వర్గం దాడికి దిగింది.. అయితే, ఈ సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి.. ప్రచార వాహనం నుండి కింద పడిపోయారు.. ఈ ఘటన కలకలం సృష్టిచింది.. ఈ వ్యవహారంతో చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement