Friday, December 6, 2024

ప‌ద‌వులు కాదు పార్టీయే ముఖ్యం…. కేశినేని నాని..

విజ‌య‌వాడ – ప‌ద‌వుల కోసం కాకుండా పార్టీ కోసం ప‌ని చేస్తున్నాన‌ని విజ‌య‌వాడ టిడిపి ఎంపి కేశినేని నానీ స్ప‌ష్టం చేశారు.. న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల భాగంగా గురువారం నాడు నానీ పాత‌బ‌స్తీలో నిర్వ‌హిస్తున్న ప్ర‌చారాన్ని ఎమ్మెల్సీ బుద్దా వ‌ర్గీయులు అడ్డుకున్నారు.. దీనిపై ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, తనకున్న ప్రజాబలంతో విజయవాడలో టీడీపీని గెలిపిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు వ్యక్తిత్వంతో పాటు సమర్థత ఉన్నవాడినే నమ్ముతారని అన్నారు. అవినీతిపరులు, లాలూచీపరులను ప్రజలు ఆమడదూరం ఉంచుతారని తెలిపారు. ఓడిపోయిన సామంతులే పార్టీకి నష్టం చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి చెందే అభ్యర్థులను మార్చితే తప్పేంటి? అని ప్రశ్నించారు. ముస్లిం కోసం చంద్రబాబును కూడా కాదని నిలబడ్డానని కేశినేని నాని వెల్లడించారు. ఎవరైనా తన వెనుక రావాల్సిందే తప్ప తాను ఒకరి వెనుక వెళ్లనని స్పష్టం చేశారు. అయితే అందరూ కలిసి వెళ్లాల్సిన సమయంలో పార్టీని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విజయవాడలో తాను, తన కుమార్తె మేయర్ పదవి కోసం కష్టపడడం లేదని, తమకు పదవులు అక్కర్లేదని, పార్టీ కోసమే కష్టపడి పనిచేస్తున్నామని నాని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement