Tuesday, May 7, 2024

AP: మంగళగిరి వైసీపీలో ముసలం.. రాజీనామాల పర్వం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలోని వైసీపీ పార్టీలో ముసలం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఆర్కే రాజీనామాతో తాడేపల్లిలో పదవులకు రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మంగళగిరి పట్టణ వైసీపీ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ రాజీనామా చేశారు. అలాగే వైసీపీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరావు రాజీనామా చేయగా, మంగళగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ సంకే సునీత రాజీనామా చేశారు.

అదేవిధంగా మంగళగిరి సోషల్ మీడియా కన్వీనర్ షేక్ గౌస్, మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు గోలి కస్తూరి, మంగళగిరి రూరల్ మండలం JCS కన్వీనర్ అన్నపురెడ్డి బ్రహ్మర్గన రెడ్డి, వైసీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ మల్లవరపు సుధారాణి, మంగళగిరి మాజీ కౌన్సిలర్ కలకోటి స్వరూప రాణి, నియోజకవర్గ నాయకులు కలకోటి బోయోజు, ఆత్మకూరు వైసీపీ నాయకులు పులివర్తి రాంబాబులు వైసీపీకి రాజీనామా చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement