Sunday, June 13, 2021

సీఐడీ అదనపు డీజీకి రఘురామ లీగల్ నోటీసు

ఏపీ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసు పంపించారు. అరెస్టు సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలంటూ నోటీసు పంపారు. ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని రఘురామ తెలిపారు. మొబైల్‌ కోడ్‌ ఓపెన్‌ చేయాలని కస్టడీలో హింసించారని అని  లీగల్‌ నోటీసులో రఘురామ పేర్కొన్నారు. ఆ ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం కూడా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News